నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఏడు గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 32.5 అడుగులకు పైగా నమోదైంది. నీటిమట్టం పెరుగుదల కారణంగా స్నాన ఘట్టాల వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కొనసాగితే భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దుమ్ముగూడెం మండలం పరిధిలోని పర్ణశాల వద్ద నార చీరల ప్రదేశానికి వరద నీరు చేరడంతో పర్యాటకులను అనుమతించడం లేదు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం పట్టణంలోకి స్లూయిజ్‌ల ద్వారా వరద నీరు ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు మోటార్లను ఏర్పాటు చేశారు.
భద్రాచలం వద్ద 32 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES