నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్‌రెడ్డిపై కౌశిక్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్రనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.
ఉద్రిక్త వాతావరణం
సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. అలాగే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్‌యూఐ నేతలు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా.. కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. కౌశిక్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ముందస్తుగా ఎన్ఎస్ యూఐ నేతలు వివిధ మార్గాల్లో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో.. అక్కడి వాతావరణం వేడెక్కుతుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES