Sunday, July 27, 2025
E-PAPER
Homeకరీంనగర్ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

- Advertisement -

– ఎరువుల దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 
– రాష్ట్ర స్థాయి పరిశీలకుడు హెచ్చరిక
నవతెలంగాణ – తిమ్మాపూర్ 

రాష్ట్రంలోని ఎరువుల వినియోగం, సరఫరా పై సమగ్ర పరిశీలన చేయడానికి రాష్ట్ర స్థాయి ఎరువుల పరిశీలకులు శ్రీ ఎస్.వి. ప్రసాద్, జనరల్ మేనేజర్, హాకా హైదరాబాద్ జిల్లాకు విచ్చేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం అలుగునూరు, పోరండ్ల, నుస్తుల్లాపూర్ ప్రాంతాల్లోని వివిధ ఎరువు పంపిణీ కేంద్రాలను సందర్శించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కృత్రిమ ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. సబ్సిడీ ఎరువులను మళ్లించటం, బ్లాక్ మార్కెట్ కు తరలించటం వంటి చర్యలు రైతులను నష్టపర్చేలా ఉంటాయని, అలాంటి వారి పై కేసులు నమోదు చేసి తగిన శిక్ష విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

రైతులకు అవగాహన, దుకాణాలకు నియంత్రణ

ఎరువుల నిల్వలు, కొనుగోళ్ల రిజిస్టర్, రైతులకు ఇవ్వబడే పరిమాణాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి దుకాణంలో స్టాక్ బోర్డు, రైతుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరు తప్పకుండా ప్రదర్శించాలన్నారు. ఎరువులను మితంగా వాడాలని, అధిక ఎరువుల వాడకముతో నేల పాడైపోతుందని, ఈ అంశంపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారి శ్రీ రామానుజాచార్యులు, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీధర్, మండల వ్యవసాయాధికారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -