జిల్లాజడ్జి జి. వి.ఎన్ భరత లక్ష్మీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా లభిస్తున్న కార్మిక ప్రయోజనాలను కార్మికలోకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి.ఎన్ భరత లక్ష్మీ విన్నవించారు. మేడే సందర్భంగా జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రదానోపన్యాసం చేశారు. పని చేసే విధానంలో తేడాలున్నాయి కానీ పనిలో తేడాలు లేవని ఆమె తెలిపారు. అన్ని రకాల కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని కార్మికుల దరికి చేర్చాలని కోరారు. కార్మికులు కష్ట జీవులని వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందాలని ఆమె అన్నారు. అదనపు జిల్లాజడ్జిలు ఆశాలత, హరీషలు మాట్లాడుతూ.. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్మిక ప్రయోజనాలే పరమావదిగా పని విధానం కలిగి ఉన్నదని తెలిపారు. కార్మికులకు చట్టసంబంధిత విషయాలలో న్యాయవిజ్ఞానాన్ని అందించడానికి మరింత శ్రామిస్తామని న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు ప్రసంగిస్తు న్యాయసేవ సంస్థ సామాజిక సేవల్లో తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి ,కార్మికులు పాల్గొన్నారు.
అందరము కార్మికులమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES