నవతెలంగాణ-హైదరాబాద్: వాయుకాలుష్యంతో నిత్యం సతమతమయ్యే ఢిల్లీ స్వచ్ఛంగా మారింది.. చాలాకాలం తరువాత గాలి నాణ్యత మెరుగుపడి జూలై 23వ తేదీన ఆ సిటీలో ఎక్యూఐ 67గా రికార్డయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలు.. గాలుల వల్ల.. ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా, గాలి స్వచ్ఛంగా మారింది. వాయు నాణ్యత సంతృప్తికర కేటగిరీలో నమోదయ్యింది. ఢిల్లీలో ఈ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ చూపించడం చాలా అరుదైన విషయం..! కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం 67 ఎక్యూఐ నమోదవ్వడం విశేషం.
సాధారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ. ఫ్యాక్టరీలు, వాహనాలు, పంటల కాలుష్యంతో ఢిల్లీ ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటుంది. ప్రస్తుతం అక్కడ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు గాలి కదలికల్లోనూ మార్పు వచ్చింది. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలులు వీస్తున్నాయి. అయితే జూలై 25వ తేదీన మళ్లీ ఎయిర్ క్వాలిటీ మాడరేట్ స్థాయిలో చూపించింది. కానీ రెండుమూడు రోజుల పాటు ఆకాశంలో కాలుష్యం తగ్గడం శుభపరిణామంగా భావిస్తున్నారు. క్లీన్ ఎయిర్‌ను పాజిటివ్ సంకేతంగా చూస్తున్నారు. పర్యావరణ, రెగ్యులేటరీ పరిణామాలు.. అర్బన్ ఎయిర్ క్వాలిటీని పెంచినట్లు అధికారులు చెబుతున్నారు.
సీపీసీబీ డేటా ప్రకారం … ఢిల్లీలో జూలై 23వ తేదీన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 67గా ఉంది. జూలైలో ఇదే క్లీనెస్ట్ డేగా రికార్డు అయ్యింది. 51 నుంచి 100 మధ్యలో ఎక్యూఐ లెవల్స్ ఉంటే దీన్ని సంతృప్తికరంగా పేర్కొంటున్నారు. దీని వల్ల వాయు సంబంధిత రుగ్మతలు ఉండవని, సాధారణ ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని భావిస్తున్నారు. జూలై 22వ తేదీన ఢిల్లీలో వాయు నాణ్యత 103గా ఉంది. ఇది మోడరేట్ క్యాటగిరీలోకి వస్తుంది. జూలై 24వ తేదీన ఎక్యూఐ .. సంతృప్తికరంగా ఉంది. ఆ రోజు మొత్తం సాటిస్‌ఫాక్టరీ రేంజ్‌లో ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి ఏడు వరకు ఏక్యూఐ 76 నుంచి 92 మధ్య ఉంది. ఇక జూలై 25వ తేదీన ఎక్యూఐ.. 128 నుంచి 136 మధ్య రికార్డు అయింది. దీన్ని మాడరేట్ కేటగిరీగా భావిస్తారు.