ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు బెజుగం అశోక్
నవతెలంగాణ-కంఠేశ్వర్
దేశ సైనికుల వలననే భారతదేశం సశ్యాశంమలంగా ఉన్నది అని ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు బెజుగం అశోక్ అన్నారు. ఈ మేరకు శనివారం బోధన్ బస్టాండ్ బర్కత్పురా నందుగల రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యాలయంలో 26వ జులై భారతదేశ గర్వించదగ్గ విజయస్ఫూర్తి కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు అశోక్ గారు హాజరై మాట్లాడుతూ ఇదే రోజు సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధంలో మన సైనికులు విజయ డంకా మోగించి దేశానికి మరుపురాని రోజును ఇచ్చారని వారి సేవలు ఎంత కొనియాడిన తక్కువేనని వీర జవానుల సేవా తత్పర్యమే నేటి భారతదేశం సస్యశ్యామలంగా ఉన్నదని అన్నారు. తదనంతరం ఇండియన్ ఆర్మీలో విశేష సేవలు అందించి రిటైర్మెంట్ చేసుకుని తిరిగి జిల్లాలో వివిధ రంగాలలో సేవ చేస్తున్నటువంటి నాయక్ ర్యాంక్ సైనికులు అయినటువంటి సాయ రెడ్డి, సాంసంన్, గంగా ప్రసాద్ లకు ఘనంగా మెమొoటోలు శాలువులతో సత్కరించారు. వీరు వారి యొక్క ఇండియన్ ఆర్మీలో చేసినటువంటి కార్యక్రమాలు, వారి ఉద్యోగరీత్యా అన్బయించినటువంటి మధుర స్మృతులను సందర్శకులకు తమ సంభాషణ ద్వారా వివరించడం జరిగినది. తదనంతరం సభా ప్రాంగణం భారతమాత కి జై అంటూ దద్దరిల్లినది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు, కార్యనిర్వాహన అధికారి వైవి రామ్మోహన్రావు, సతీష్ షహ, మోటూరి మురళి, జ్ఞాన ప్రకాష్, అంకితగర్వాల్, విజయరామ్, జితేంద్ర మలాని, రాజ్కుమార్ సుబేదార్, శ్రీకాంత్ జవహార్ నర్సింగ్ రావు, తదితరులతో పాటు సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.