Sunday, July 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీ వర్షాలు..కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్

భారీ వర్షాలు..కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొన్ని రోజులు భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి. నదులు పొంగిపొర్లటంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ యాత్రను తాత్మాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడడంతో యాత్రికుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అనుకూలంగా మారిన తరువాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటన వచ్చేవరకు యాత్రను కొనసాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -