నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లాలో ఉన్న కోయ వెల్పుల జాతరల గుడులను, మేడారం జాతరతో పాటుగా నిధులు కేటాయించి అబివృద్ధి చేయాలని, వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి మహిపతి సంతోష్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మహిపతి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కోసం 100 కోట్ల నిధులు కేటాయించడం పట్ల జిల్లా గిరిజన ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూనము అని అన్నారు.
అలాగే జిల్లా లో ఉన్న కోయ వేల్పుల జాతరలో గుడుల అబివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి గిరిజన గూడెం లో ఉన్న గుడుల ను మేడారం జాతర నిధులు తొ సమానంగా అబివృద్ధి కోసం కూడా ప్రభుత్వం పరిశీలన చేయాలని అన్నారు. ఐలాపూర్, భూపతిపూర్, అక్నగూడెం, రంగాపూర్ లాంటి అన్ని వేల్పు గుడుల ను అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రతి స్థలంలో వేల్పుల సామాగ్రి “దాల్ గుడ్డ” ను నూతనగా చేయించాలని అన్నారు. ప్రతి గిరిజన ఇంటి పేరుతో ఒక వేల్పు ఉంటుందని, వేల్పుల మూడవ గట్టు, నాల్గవ గట్టు, ఐదవ గట్టు, ఆరవ గట్టు, ఏడవ గట్టు దేవరల గుడుల ను ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అబివృద్ధి చేయ్యాలి అని డిమాండ్ చేశారు. గిరిజన సంస్కృతీ పరిరక్షణ కోసం అందరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా సభ్యులు ఇర్ప స్వామి, జగదీశ్, రాజు, సలెండర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.