Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులను నియమించాలి 

నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులను నియమించాలి 

- Advertisement -

నవతెలంగాణ- చారకొండ 
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని సాధన కమిటీ ప్రతినిధులు మండల ఎమ్మార్వో సునీతకి వినతి పత్రం అందజేశారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులలో వికలాంగులను నియమించాలని కోరారు. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లభిస్తే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో వికలాంగులకు అందుతాయన్నారు. ఎమ్మార్వో చొరవ తీసుకొని నామినేటెడ్ సభ్యులుగా నియమించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సాధన కమిటీ సభ్యులు ఎమ్మార్వో ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్య దివ్యాంగ నాయకులు శేఖర్,సైదులు,గోపయ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -