ఐఎఫ్ఎస్ , డిఎఫ్ఓ కామారెడ్డి నికితా బోగా
నవతెలంగాణ – కంఠేశ్వర్ : పట్టుదల ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులకు సమయం విలువ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఎఫ్ఎస్ , డిఎఫ్ కామారెడ్డి నికితా బోగా అన్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ గురువారానికి ఆరవ రోజుకు చేరుకుంది. మొదట తైక్వాండో శిక్షకుడు మనోజ్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఏదైనా సంఘటనలు జరిగితే ఎలా రక్షించుకోవాలో పలు సంఘటనలను ఉదాహరణ ఇస్తే క్లుప్తంగా ఇలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ , డిఎఫ్ఓ కామారెడ్డి నికితా బోగా విద్యార్థినీలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మంచి అనుభూతి లభిస్తుందన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులు ప్రతిదీ నేర్చుకోవాలని, అలా నేర్చుకో వడం ద్వారా విద్యార్థులు గొప్పగా ఆలోచించగలుగుతారన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు సాగాలన్నారు. మనం పర్యావరణాన్ని కాపాడటం ఎంత అవసరమో, దాని గురించి అవగాహన కల్పిస్తూ.. పర్యావరణ కాలుష్యం, అటవీ నిర్మూలన, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. చెట్టుకు ఎంత నీరు పోసి పెంచితే అంత పెరుగుతుంది. అయితే అలాగే దానిని నరికే అధికారం మనకు లేదు. అలా ఒక్కొక్క అంశంపై క్లుప్తంగా విద్యార్థినిలకు సూచిస్తూ భవిష్యత్తులో ఎలా ఎదగాలి.. ఎలా ఉండాలి తెలియజేశారు. పోటీ పరీక్షల సమయంలో ఇబ్బందులు పడకుండా లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. అంతకుముందు మోటివేషన్ స్పీకర్లు శ్రీహరి, మహిపాల్ విద్యార్థినీలతో తల్లిదండ్రుల విలువలను గురించి వివరించారు.
చిన్ననాటి నుండి మనం అనుకున్న లక్ష్యానికి చేరుకునే వరకు తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడతారో క్లుప్తంగా వివరించారు. మానవ విలువలు, నైతిక విలువలు, సంస్థాగత విలువలు, ఆర్థిక విలువలు వంటి రకాలుగా ఉంటాయి. విలువలు నిర్ణయాలకు దిశానిర్దేశం చేస్తాయి, ఆలోచనలకు ఆచరణ ఇస్తాయి, చర్యలకు ప్రేరణనిస్తాయి మరియు ప్రాధాన్యతలను నిర్ణయిస్తాయి. దయ, నిజాయితీ, విధేయత, ప్రేమ, శాంతి, సానుభూతి, నిజం వంటి అంశాలతో వివరించడంతో ఆ హాల్లో ఉన్న విద్యార్థినీలు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మూడనమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలన, సోషల్ మీడియా ద్వారా మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు తదితర అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాజాతా నిర్వహించారు. చివరగా పోలీస్ శాఖ కళాబృందంతో ఒక స్కిట్ నిర్వహించారు. సైబర్ నేరాల ద్వారా ఎలా ఫోన్లు చేసి ఏలా డబ్బులు ఖాళీ చేస్తారో క్లుప్తంగా వివరించారు. సామాజిక రుగ్మతలను నిర్మూలించి శాస్త్రీయ దృక్పథంతో కూడిన అవగాహన కల్పించేందుకు యువత, విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సౌత్ రూరల్ సీఐ సురేష్, యోగా గురువు కిషన్, జేసీఐ సభ్యులు విజయానంద్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రాజేష్, కిరణ్ గౌడ్, గణేష్, రాజేందర్, సుప్రజ, హోంగార్డ్ నవీన్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో ఏదైనా సాధ్యమే..
- Advertisement -
RELATED ARTICLES