Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకారు బోల్తా..ఒకరి మృతి

కారు బోల్తా..ఒకరి మృతి

- Advertisement -

నవతెలంగాణ-చిన్న శంకరంపేట : మద్యం మత్తులో కరెంటు స్తంభానికి కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి మరొకరికి గాయాలైన సంఘటన చిన్న శంకరంపేట మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. చేగుంట టు మెదక్ ప్రధాన రహదారిపై చిన్న శంకరంపేట పెట్రోల్ బంక్ సమీపన గల బాలాజీ ధర్మ కాంట దగ్గర ప్రమాదం జరిగినది.
ఎర్టిగా కారు కరెంటు స్తంభానికి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జస్వంత్ 18 సంవత్సరాలు చేగుంట మండ పొలంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కారు కిరాయి తీసుకొని  పుట్టినరోజుకు హాజరైన మిత్రులు తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం త్రాగిన మత్తులో ఆజాగ్రత్తగా కారు నడపడంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తు కరెంటు స్తంభానికి ఢీ కొట్టిందని అన్నారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు 20 సంవత్సరాల లోపే ఉన్న యువకులుగా స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -