Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుషటిల్ ఆడుతూ యువ‌కుడు మృతి

షటిల్ ఆడుతూ యువ‌కుడు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌ల దేశంలో యువ‌కుల్లో గుండెపోటు మ‌ర‌ణాలు ఎక్కువ‌వుతున్నాయి. చిన్న పెద్దా తేడాలేకుండా హ‌ర్ట్ స్ట్రోక్‌తో ప‌లువురు యువ‌కులు మ‌ర‌ణిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక నాగోల్ స్టేడియంలో గుండ్ల రాకేష్(25) అనే యువకుడు షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్పందించిన అక్కడున్న యువకులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -