నవతెలంగాణ-హైదరాబాద్: 19 ఏళ్ల దివ్య దేశ్ ముఖ్ ఎఫ్‌ఐడిఇ మహిళల చెస్ ప్రపంచ కప్‌లో తొలి భారతీయ చాంపియన్‌గా నిలిచింది. కోనేరు హంపి (38)ని ఓడించి ఈ విజయాన్ని చేజిక్కించుకుంది. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన రెండో ర్యాపిడ్ టై -బ్రేకర్ గేమ్‌లో నల్ల పావులతో దివ్య కోనేరు హంపీని ఓడించి కిరీటాన్ని కైవసం చేసుకుంది. రెండు రోజుల క్లాసికల్ చెస్ డ్రాగా ముగిసిన తర్వాత, సోమవారం టై -బ్రేకర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. మొదటి ర్యాపిడ్ టై బ్రేకర్‌లో కోనేరు హంపి, దివ్యల ఆట డ్రాగా ముసగింది. రెండో మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించింది. ఇది ప్రారంభం మాత్రమేనని తాను భావిస్తున్నానని దివ్య దేశ్‌ముఖ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ టోర్నమెంట్‌కు ముందు తనకు ఒక్క ప్రయాణం కూడా లేదని అన్నారు.
