Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంసదాశివపేటలో క్షుద్ర పూజలు!

సదాశివపేటలో క్షుద్ర పూజలు!

- Advertisement -

– ఓ బాలికను బలి ఇచ్చేందుకు యత్నం..!
నవతెలంగాణ-సదాశివపేట

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ బాలికను బలి ఇచ్చేందుకు యత్నించినట్టు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో గల బీరువా తయారీ షాపులో ఓ కుటుంబం బంగారం కోసం బాలికను బలి ఇచ్చే యత్నం చేశారు. దీని కోసం క్షద్ర పూజలు చేయాలనుకున్నారు. అందుకు అయోధ్య నుంచి ఓ స్వామిని పిలిపించారు. బాలిక తండ్రికి భారీ మొత్తంలో డబ్బులు ఆశ చూపడంతో, పూజ చేసే ప్రాంతానికి బాలికను గుట్టుచప్పుడు కాకుండా తండ్రి తీసుకొచ్చాడు. పూజలు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరగ్గా.. ఈ విషయం తెలుసుకొని అక్కడకు వెళ్లిన కాలనీవాసులకు భారీ శబ్దాలు వినిపించాయి. కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పూజా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ విషయమై సీఐ, ఎస్‌ఐలను ఫోన్‌లో సంప్రదించడానికి యత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -