– అచ్యుతానంద్‌కు సీపీఐ(ఎం) అండమాన్, నికోబార్ ఘన నివాళి
పోర్ట్ బ్లెయిర్ : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్‌కు పార్టీ అండమాన్, నికోబార్ శాఖ ఆర్గనైజింగ్ కమిటీ ఘనంగా నివాళర్పించింది. పోర్ట్‌బ్లెయిర్‌లో అనార్కలిలోని షహీద్ భవన్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ నెల 26న సంతాప సభను నిర్వహించింది. 102 ఏండ్ల అచ్యుతానందన్ ఈ నెల 21న తిరువనంతపురంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సంతాప సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి అయ్యప్పన్ అధ్యక్షత వహించారు. సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. అలాగే, మాట్లాడుతూ అచ్యుతానందన్ రాజీలేని పోరాట యోధుడు అని, సమాజంలోని అన్ని రకాల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన విజేతగా గుర్తుండిపోతారని చెప్పారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి కెజి దాస్ మాట్లాడుతూ 8 దశాబ్దాలుగా అచ్యుతానందన్ నిర్వహించిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి లక్ష్మణ్‌రావు, బి.చంద్రచూడన్, డాక్టర్ గౌరంగ మాఝీ ప్రసంగించారు. ఈ సమావేశానికి పోర్ట్‌బ్లెయిర్ పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు.
రాజీలేని పోరాట యోధుడు
- Advertisement -
- Advertisement -