Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలురిమాండ్‌లో మావోయిస్టు శ్రీవిద్య

రిమాండ్‌లో మావోయిస్టు శ్రీవిద్య

- Advertisement -

– హైకోర్టుకు చెప్పిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మావోయిస్టు పార్టీకి చెందిన నార్ల శ్రీవిద్య కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌లో ఉన్నారని పోలీసులు సోమవారం హైకోర్టుకు చెప్పారు. మియాపూర్‌ కోర్టులో హాజరుపరిస్తే జడ్జి రిమాండ్‌ ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. దీంతో ఆమెను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ తండ్రి సుధాకర్‌ శర్మ వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణను మూసేసింది. నార్ల శ్రీవిద్యను పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారనీ, ఆమెకు ప్రాణహాని ఉందని పిటిషన్‌ను జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ బి మధుసూదన్‌రావు డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఆమె రిమాండ్‌లో ఉందని తేలడంతో పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
భూదాన్‌ భూములపై హైకోర్టులో వాదనలు
భూదాన్‌ భూములపై వినతిపత్రాలు అందాయనీ, వాటిపై వాస్తవాలు నిగ్గు తేల్చాలనే క్రమంలో విచారణ కమిషన్‌ వేయడం వీలుకాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ఇద్దరు వ్యక్తుల వినతిపత్రంపై కమిషన్‌తో విచారణకు ఆదేశిస్తే, భవిష్యత్‌లో ఇదే తరహాలో వందల వినతిపత్రాలు వస్తాయని చెప్పింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వేర్వేరు సర్వే నెంబర్లలో భూదాన్‌ భూముల్లో అక్రమాలు జరిగాయనీ, పలువరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా కొనుగోలు చేశారనీ, దీనిపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లను సోమవారం హైకోర్టు విచారించింది. విచారణ మంగళవారం కొనసాగిస్తామని జస్టిస్‌ కె లక్ష్మణ్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -