Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వండర్ కిడ్స్ ఉన్నత పాఠశాల లో వన మహోత్సవం

వండర్ కిడ్స్ ఉన్నత పాఠశాల లో వన మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : తెలంగాణలో నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా మండల కేంద్రం లోని  స్థానిక వండర్ కిడ్స్ వున్నత పాఠశాల లో మంగళవారం వనమహోత్సవం సంబంధించిన చిత్ర లేఖన పోటీలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల లోని చిన్నారులు, విద్యార్ధులు చెట్లను రక్షించాలి,నీటిని పొదుపుగా వాడుకోవాలి,భూమి కాలుష్యం కాకూడదు అనే అంశం పైన పాఠశాల ప్రాంగణంలో చిత్ర లేఖన పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.వండర్ కిడ్స్ పాఠశాలల ఛైర్మెన్ మౌలాలి మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ మానవాళికి అటవీ సంపద ఎంతో అవసరం వుందని చెప్పారు.వృక్షో రక్షిత రక్షిత అని మొక్కలను పెట్టి వాటిని సంరక్షిస్తే అవి మనల్ని సంరక్షిస్తాయని ప్రతి ఒక్కరూ తన ఇంటి వద్ద మొక్కలు నాటలన్నారు. ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ కాలుష్యాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి సంరక్షణ చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -