Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంకార్మికుల హక్కులు, సంక్షేమం, చట్టాలపై దాడి

కార్మికుల హక్కులు, సంక్షేమం, చట్టాలపై దాడి

- Advertisement -

– సంఘాల్లేకుండా చేసే కుట్ర
– రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోను సవరించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ఈసీఐఎల్‌ చౌరస్తా నుంచి ఉప్పల్‌ చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ
నవతెలంగాణ – సిటీబ్యూరో

కార్మికుల హక్కులు, సంక్షేమం, చట్టాల మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. మే డేను పురస్కరిం చుకుని గురువారం సీఐటీయూ మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌ చౌరస్తా నుంచి ఉప్పల్‌ చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో పాలడుగు భాస్కర్‌ మాట్లా డుతూ.. పెట్టుబడిదారీ విధానానికి, పెట్టుబడు దారులకు దేశ, ప్రపంచ వ్యాప్తంగా పాలకవర్గాలు వత్తాసు పలుకుతున్నా యన్నారు. చట్టాలు, సంఘా ల్లేని దేశంగా మార్చి దేశ ప్రజలను పెట్టుబడిదారు లకు బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కార్మికవర్గం మీద దాడి చేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ, ఏఐ, ఉత్పాదకశక్తి పెరుగుతున్న కాలంలో తక్కువ పని గంటలు.. ఎక్కువ వేతనాలు ఉండాలి కానీ ఎక్కువ వేతనాలు ఇవ్వకుండా పని గంటలు పెంచే కుట్ర జరుగుతోందని అన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం మే డే స్ఫూర్తితో ఉద్యమి ద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, వినోద, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌, చంద్రశేఖర్‌, నాయకులు శ్రీనివాస్‌, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -