Friday, May 2, 2025
Homeతాజా వార్తలుయాజమాన్యాల కోసమే లేబర్‌కోడ్‌లు

యాజమాన్యాల కోసమే లేబర్‌కోడ్‌లు

– అవి అమలైతే కార్మికులు బానిసలే
– ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో వాటిని తిప్పికొట్టాలి
– ఐఎల్‌ఓ ఆరు గంటల విధానం తేవాలంటుంటే ఇక్కడ 12 గంటల పని అమలు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
– మేడే సందర్భంగా హైదరాబాద్‌లో సీఐటీయూ ర్యాలీ
– వందలాదిగా తరలొచ్చిన కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

యాజమాన్యాల లాభాలను మరింత పెంచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను అమలు చేయబోతున్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య విమర్శించారు. లేబర్‌ కోడ్‌లు వస్తే కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో వాటిని తిప్పికొ ట్టేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని నారాయణగూడ వైఎం సీఏ చౌరస్తా నుంచి గోల్కొండ చౌరస్తా వరకు సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అం దులో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. డప్పుల దరువులు.. కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. నారాయణ గూడ ప్లైఓవర్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, చిక్కడపల్లిలో డీవైఎఫ్‌ఐ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, ముషీరా బాద్‌లో ఐద్వా నాయకులు సీఐటీయూ ర్యాలీకి స్వాగతం పలి కారు. అనంతరం గోల్కొండ క్రాస్‌ రోడ్డులోని సీఐటీయూ సిటీ కార్యాలయంలో ఆ యూనియన్‌ జెండాను ఎస్‌.వీరయ్య ఆవిష్క రించారు. అంతకు ముందు వైఎంసీఏ చౌరస్తాలో ర్యాలీ ప్రారం భం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో నగరంలో సాగిన పోరాటాన్నీ, అమరుల త్యాగాలను, మేడే చరిత్రను, ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు రాజ్యాల ఏర్పాటును సోదాహరణంగా వివరించారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును బ్రిటీష్‌ హయాంలోనే కార్మికులు కొట్లాడి సాధించుకున్నారని గుర్తుచేశారు. ఆ తర్వాత కాలంలోనే హక్కుల కోసం అనేక చట్టాలను కూడా సాధించుకున్నారని తెలి పారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, 8 గంటల పనివిధానం, తదితర సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆ చట్టాల ఫలితంగానే దక్కుతు న్నాయని వివరించారు. కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం యాజమా న్యాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ కార్మిక వర్గంపై దాడి చేస్తున్న తీరును ఎండగట్టారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు వస్తే యజమానుల వద్ద కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదముందని వాపోయారు. ఇప్పటికే చాలా చోట్ల 12 గంటల పనివిధానం అనధికారికంగా అమలవు తున్నదనీ, కోడ్‌లు అమల్లోకి వచ్చే కార్మికులపై మరింత భారం పడే ప్రమాదముందని హెచ్చరించారు. వారంలో కనీసం 90 గంటల పనిచేయాలని కొందరు పెట్టుబడిదారులు బహిరంగంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో ఎనిమిది గంటల పనివిధానాన్ని ఆరు గంటలకు కుదించాలని ఐఎల్‌ఓ సూచిస్తుంటే ఇక్కడ మాత్రం పెట్టుబడిదారులు, పాలకులు 12, 14 గంటల పనివిధానాన్ని తేవాలని చూడటం దుర్మార్గమన్నారు. ఈ విషయంలో కార్మికులు ఐక్యం కాకుండా కులం, మతం పేరిట బీజేపీ విభజిస్తున్న తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు జె.కుమారస్వామి, ఎం వెంకటేష్‌, సీనియర్‌ నాయకులు ఎం శ్రీనివాస్‌, శ్రామిక మహిళ కన్వీనర్‌ బి కిరణ్మయి, నగర కోశాధికారి కే అజరుబాబు, నగర నాయకులు జి.రాములు, ఎం సత్యనారాయణ, టీ మహేందర్‌, డీఎల్‌.మోహన్‌, ఎం.శ్రీనివాస్‌, దశరథ, ఆర్‌.వెంకటేశ్‌, నాగలక్ష్మి, టీవీకే ప్రసాద్‌, సుమిత్ర, ఆరోగ్యమ్మ, రమావేణి, రవీందర్‌, గీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img