Thursday, July 31, 2025
E-PAPER
Homeకరీంనగర్Muslims Reservation : ముస్లింలకు రిజర్వేషన్ లపై బీజేపీ ద్వంద్వ ధోరణి

Muslims Reservation : ముస్లింలకు రిజర్వేషన్ లపై బీజేపీ ద్వంద్వ ధోరణి

- Advertisement -

  • – మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

 నవతెలంగాణ –  కరీంనగర్ 

తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై బీజేపీ నాయకుల వాఖ్యలు దురుద్దేశపూరితమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో సూడ్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్, మహారాష్ట్రల్లో బీజేపీ పాలనలో ముస్లింలకు రిజర్వేషన్ అమలవుతున్నప్పటికీ, అదే విధానం తెలంగాణలో అమలుకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు మాట్లాడడం ద్వంద్వ ధోరణిని సూచిస్తోందని విమర్శించారు.“రాజ్యాంగం ప్రకారం సామాజిక వెనుకబాటుకు గురైన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి. మతపరమైన రిజర్వేషన్ కాదని, వెనుకబాటును ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. 56 శాతం జనాభా వెనుకబాటుతో ఉన్నట్టు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో 10 శాతం ముస్లిం జనాభా కూడా ఉంది. కానీ బీజేపీ నాయకులు మతం పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని ఆయన అన్నారు.

“42 శాతం రిజర్వేషన్ బిల్లు శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన తరువాత గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. మూడు నెలలు గడిచినా రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించలేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ బిల్లు అమలులోకి వచ్చినట్టే,” అని ఆయన గుర్తుచేశారు.

బీజేపీ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 9వ షెడ్యూల్‌లో ఈ బిల్లు చేర్చే బాధ్యత వారి మీద ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని పాటిస్తూ నిజమైన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడిందని తెలిపారు.

“ముస్లింలలోనూ, హిందువులలోనూ సామాజిక వెనుకబాటుకు గురవుతున్న వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇది దేశవ్యాప్తంగా అమలవుతోన్న విధానమే. బీజేపీ మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతోందని విమర్శించడం అవాస్తవం,” అని అన్నారు.

బలహీన వర్గాల రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్ర రావు వంటి బీజేపీ నేతలు ప్రధాని, హోంమంత్రిపై ఒత్తిడి తెచ్చి చొరవ చూపాలని కోరారు. “సామాజిక న్యాయం కోసం మేము బిల్లు తెచ్చాం. బీజేపీ అడ్డుపడకండి. మద్దతు ఇవ్వండి,” అంటూ జీవితన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -