Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు

శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని ఇసన్నా పల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని మంగళవారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు ఆలయ విశిష్టతను వారికి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ వారికి శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రభు రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, కైలాస్ లక్ష్మణ్ రావు, అర్చకులు శ్రీనివాస్ శర్మ, సిబ్బంది నాగరాజు, కాంగ్రెస్ నాయకులు రంగు రవీందర్ గౌడ్, నామాల రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -