Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసైనికులకు ఓపీఎస్‌ అమలు చేయాలి

సైనికులకు ఓపీఎస్‌ అమలు చేయాలి

- Advertisement -

– ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో గురువారం యూపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరగాల్సిన నిరసనను వాయిదా వేశామని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్‌) సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఉగ్రదాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించామని చెప్పారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమని విమర్శించారు. దేశం యావత్తు ఈ ఘటనను ఖండించాలని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, పారామిలిటరీ బలగాల్లోని సైనికులకు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామన్నారు. టీఎస్‌సీపీఎస్‌ఈయూ కోశాధికారి నరేష్‌గౌడ్‌ మాట్లాడుతూ ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌, రాష్ట్ర బాధ్యులు నటరాజ్‌, సుశీల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad