నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్)కు రాష్ట్రవ్యాప్తంగా 1,83,653 దరఖాస్తులొచ్చాయి. టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువు బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్ చైర్‌పర్సన్ ఈవి నరసింహారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేపర్-1కు 63,261 మంది, పేపర్-2కు 1,20,392 మంది కలిపి మొత్తం 1,83,653 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. దరఖాస్తుల సవరణకు శనివారం వరకు గడువుందని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో టెట్ రాతపరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇతర వివరాల కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
టెట్‌కు 1.83 లక్షల దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES