- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పాన్ని భూకంపం షేక్ చేసిన విషయం తెలిసిందే.కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రి దృశ్యాలను రష్యన్ న్యూస్ నెట్‌వర్క్ ఆర్టీ(RT) షేర్ చేసింది. ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. ప్రకంపనల ధాటికి ఆ భవనం మొత్తం ఊగిపోయింది. అయితే.. వైద్యులు ఏ మాత్రం భయపడకుండా.. ప్రశాంతంగా ఉండి ఆ సర్జరీని విజయవంతం చేశారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
- Advertisement -