Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబెట్టింగ్‌ యాప్‌ కేసులో ప్రకాశ్‌రాజ్‌ను విచారించిన ఈడీ

బెట్టింగ్‌ యాప్‌ కేసులో ప్రకాశ్‌రాజ్‌ను విచారించిన ఈడీ

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బెట్టింగ్‌ యాప్‌ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారించారు. బెట్టింగ్‌ యాప్‌ను ప్రోత్సహించటం ద్వారా తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు సెలబ్రెటీలు హవాలా ద్వారా పెద్ద మొత్తంలో లబ్దిని పొందారని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కొందరు తెలుగు సినీ నటులను ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా తామిచ్చిన నోటీసు మేరకు ప్రకాశ్‌రాజ్‌ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకొని విచారణకు సహకరించారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ అధికారులు విచారించి పంపించివేశారు. త్వరలోనే నటుడు దగ్గుబాటి రానా, విజరు దేవరకొండ, నటి మంచు లక్ష్మి కూడా ఈడీ ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు హాజరు కానున్నారని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -