– తులం బంగారు నెక్లెస్, నాలుగు లక్షల నగదు అపహరణ
నవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో బుధవారం రాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సమీపంలో నివాసం ఉండే మోర శంకర్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా మండలంలోని కిష్టంపేట గ్రామానికి ఓ శుభకార్యానికి వెళ్లారు.
రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చిన శంకర్, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి, తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఇంటిలో సుమారు తులంనర బంగారు నెక్లెస్, రూ.4 లక్షల నగదు దొంగలు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. పట్టణంలోని ప్రజల్లో భయాందోళన సృష్టించిన ఈ చోరీపై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాయికల్‌లో దొంగతనానికి పాల్పడిన దుండగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES