ఏకంగా 7 అవార్డులతో 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా విజయకేతనం ఎగుర వేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో శుక్రవారం కేంద్ర సమాచార శాఖామంత్రి డా.ఎల్ మురుగన్ ఈ పురస్కారాలను ప్రకటించారు.
‘ట్వల్త్ ఫెయిల్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ నటులుగా షారూఖ్‌ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (ట్వల్త్ ఫెయిల్), జాతీయ ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ( మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే), జాతీయ ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) పురస్కారాలను దక్కించుకున్నారు.
7 అవార్డులతో తెలుగు సినిమా విజయకేతనం
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : సాయి రాజేష్ (బేబి), ఉత్తమ లిరిక్స్ : కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ నేపథ్య గాయకుడు : రోహిత్ (బేబి), ఉత్తమ బాలనటి : సుకృతి వేణి (గాంధీతాత చెట్టు)
71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా మరోమారు సత్తా చాటింది. ఏకంగా 7 అవార్డులను దక్కించుకుని విజయదుందుభి మోగించింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరీ’ జాతీయ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికవ్వగా, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ, ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ‘హనుమాన్’ చిత్రం రెండు పురస్కారాలను దక్కించు కుంది. అలాగే ‘బేబి’ సినిమాకి సంబంధించి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా దర్శకుడు సాయి రాజేష్, ‘ప్రేమిస్తున్నా’ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎన్‌ఎస్ రోహిత్ అవార్డులకు ఎంపికయ్యారు. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్, ఉత్తమ బాలనటిగా సుకృతివేణి (గాంధీతాత చెట్టు) ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 7 అవార్డులతో తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన విజేతలందరికీ సోషల్‌మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు అవార్డుల పంట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES