- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో శుక్రవారం రాత్రి రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 10 బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు.
- Advertisement -