నవతెలంగాణ – అశ్వారావుపేట
సాగులో మెలుకువలు, యాజమాన్యం పద్దతులపై గ్రామీణ రైతాంగానికి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ కళాశాల కు చెందిన 17 మంది శాస్త్రవేత్తలు, 8 బృందాలుగా ఏర్పడి అవగాహనా శిబిరాలు నిర్వహిస్తారని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ శుక్రవారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాల్లో 48 గ్రామాల్లో ఆరు వారాల పాటు ( మే 5 నుండి జూన్ 13 వరకు) రైతులకు అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు. ఈ బృందాల్లోని శాస్త్రవేత్తలు ఐ.శ్రీనివాసరెడ్డి, టి.శ్రావన్, కే.నాగాంజలి, ఝాన్సీరాణి, జంబమ్మ, కే.శిరీష, ఎస్.మధుసూధన్ రెడ్డి, పీ.రెడ్డి ప్రియా, ఎం.రాంప్రసాద్, పీ.రమేష్, టీ.పావని, ఐ.క్రిష్ణతేజ, డి.స్రవంతి, పీ.శ్రీలత, కే.కోటేశ్వర్, పీ.నీలిమ లు ఒక్కొక్కరు ఒక్కో వ్యవసాయ అంశం అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ అవగాహన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.
అవగాహనా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES