డీపీఓ దేవరాజ్
నవతెలంగాణ -తా డ్వాయి : మేడారంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో, భక్తులు విడిది ప్రాంతాలలో దుర్గంధం వ్యాప్తి చెందకుండా పారిశుధ్య పనులు శుక్రవారం ముమ్మరంగా సాగుతున్నాయి. డీపీఓ దేవరాజ్, ఎంపిఓ శ్రీధర్రావు దగ్గరుండి పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు. మేడారం గద్దెల ప్రాంగణం, విడిది గృహాలు, జంపన్న వాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ , మేడారంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు, మాంసం వ్యర్థ పదార్థాలను తొలగిస్తున్నారు. అప్పుడప్పుడు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కర్యక్రమంలో స్థానిక మేడారం కార్యదర్శి కొర్నెబెల్లి సత్తీష్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మేడారంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES