Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆగస్టు 5న విప్లవ వార్షికోత్సవం: యూనిస్ ఖాన్

ఆగస్టు 5న విప్లవ వార్షికోత్సవం: యూనిస్ ఖాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లోని యూనిస్ ఖాన్ నేతృ‌త్వంలో తాత్కాలిక ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న విప్లవ వార్షికోత్సవం గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే, ప్రజాస్వామ్య సవరణల జాబితాను విడుదల చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం తెలిపింది.

ఈ సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీల ఆమోదం కోసం ముసాయిదా కాపీలను పంపారు. ప్రధాన సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ..వచ్చే మంగళవారం ఆగస్టు 5 సాయంత్ర 5 గంటలకు జరిగే వేడుకల్లో అన్ని పార్టీల సమక్షంలో ఈ సంస్కరణలను దేశం ముందు ఉంచుతాం అని చెప్పారు. బంగ్లాదేశ్ జాతీయ ఏకాభిప్రాయ కమిషన్ నిర్వహించిన చర్చల్లో, 23 ప్రాథమిక సంస్కరణల్లో 19పై ఏకాభిప్రాయం, నిర్ణయాలు కుదిరినట్లు తెలుస్తోంది. 8 అంశాలపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని, 11 అంశాలపై భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

కాగా, గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. దీంతో ఆమె ప్రత్యేక విమానంలో భారత్ చేరిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -