నవతెలంగాణ – న్యూఢిల్లీ: పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల రంగాలలో భారతదేశం యొక్క వేగవంతమైన వృద్ధి, పర్యావరణ పై కూడా ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో, ఏప్రిల్ 22–24, 2026 వరకు దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఐఎఫ్ఏటి- ఢిల్లీ ప్రదర్శన జరుగనుంది. దాదాపు 60 సంవత్సరాలుగా, పర్యావరణ ఆవిష్కరణలకు వేదికగా ఐఎఫ్ఏటి పనిచేస్తోంది. భారతదేశంలో, దాని కార్యక్రమాలు చాలా విస్తృతమైనవి. ముంబైలో 11 విజయవంతమైన ఎడిషన్‌లు నిర్వహించిన ఈ సంస్థ, సరైన వ్యక్తులు – సాంకేతిక నిపుణులు, విధాన నిర్ణేతలు, మునిసిపల్ నాయకులు – కలిసి వచ్చినప్పుడు నిజమైన, శాశ్వత మార్పు రాగలదని నిరూపించింది. ఇప్పుడు, మెస్సే ముయెంచెన్ ఇండియా ఆ ఊపును ఢిల్లీకి తీసుకువస్తోంది.
“ఐఎఫ్ఏటి ఢిల్లీ భారతదేశ పర్యావరణ సాంకేతిక రంగానికి ఒక కీలకమైన క్షణం” అని ఐఎంఈఏ అధ్యక్షుడు, మెస్సే ముయెన్‌చెన్ మరియు మెస్సే ముయెన్‌చెన్ ఇండియా సీఈఓ భూపిందర్ సింగ్ ప్రకటించారు. “కీలక మంత్రిత్వ శాఖల చేతికి అందేంత దూరంలో ఫెయిర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, మేము ఆవిష్కరణను ప్రదర్శించడమే కాదు – మేము దానిని నేరుగా భారతదేశ విధాన కార్యాచరణలో భాగం చేయటానికి ప్రయత్నిస్తున్నాము ” అని అన్నారు.
“ఘన వ్యర్థ నిపుణుల కోసం, ప్రభుత్వం, పరిశ్రమ కొనుగోలుదారులతో నేరుగా చర్చించటానికి ఐఎఫ్ఏటి ఢిల్లీ అపూర్వమైన వేదికను అందిస్తుందని హామీ ఇచ్చింది” అని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సీఈఈ సీనియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ తుషార్ జాని అన్నారు.
ఈ ప్రదర్శనకు అనుబంధంగా మల్టి -ట్రాక్ సమావేశ కార్యక్రమం ఉంటుంది, ఇక్కడ విధానం, ఆచరణను కలుస్తుంది. మంత్రిత్వ శాఖలు, ప్రపంచ సంస్థలు , పరిశ్రమల నాయకులు కీలకమైన అంశాలను చర్చిస్తారు.
“ అభివృద్ధిలో కీలకమైన అంశం, నీటి భద్రత” అని అంతర్జాతీయ నీటి సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళా వైరవమూర్తి పేర్కొన్నారు. “ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక నైపుణ్యాన్ని సమావేశపరచడంలో సహాయం చేయడానికి , స్థానికంగా సంబంధిత పరిష్కారాలను మెరుగ్గా అంచనా వేయడానికి ఆవిష్కర్తలు, యుటిలిటీలు , విధాన రూపకర్తల మధ్య సంభాషణను ప్రేరేపించడానికి ఐడబ్ల్యుఏ ఎదురుచూస్తోంది” అని అన్నారు.