Sunday, May 4, 2025
HomeUncategorizedహార్పిక్ బ్రాండ్ అంబాసిడర్ గా షారూఖ్ ఖాన్

హార్పిక్ బ్రాండ్ అంబాసిడర్ గా షారూఖ్ ఖాన్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: 100 మిలియన్లకు పైగా కుటుంబాలు విశ్వసిస్తున్న ఇంటి పారిశుధ్యపు సొల్యూషన్లలో అగ్రగామి  అయిన భారతదేశపు నెం.1 టాయిలెట్ మరియు బాత్ రూమ్ క్లీనర్ హార్పిక్,  కింగ్ ఆఫ్ బాలీడ్ షారూఖ్ ఖాన్ కు తన బ్రాండ్ అంబాసిడర్ గా స్వాగతం పలకటం ద్వారా తన చరిత్రలో ఒక మైలురాయిని సగర్వంగా ప్రకటిస్తోంది. అత్యుత్తమ పరిశుభ్రతను అందించే హార్పిక్ యొక్క విశ్వసనీయమైన చరితను షారూఖ్ ఖాన్ కు ఉన్న అపారమైన ఆకర్షణ, ఒకే విధమైన విలువలు, భారతీయ కుటుంబాల్లో అపారమైన ప్రభావాన్ని ఈ శక్తివంతమైన భాగస్వామ్యం ఏకం చేస్తుంది.  ఒక శతాబ్దానికి పైగా హార్పిక్, పారిశుధ్యపు ప్రమాణాలను పునర్నిర్వచిస్తూ, అంతర్జాతీయంగా మార్గదర్శన చేసింది. నేడు, భారతదేశంలో ప్రతి 3 కుటుంబాల్లో~ 1 కుటుంబాన్ని చేరుకుని హార్పిక్, భారతదేశపు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వ్యాప్తంగా కుటుంబాలను సశక్తీకరించి, ఒక శక్తివంతమైన, ప్రభావవంతమైన మరియు విశ్వసనీయమైన క్లీనింగ్ పరిష్కారమార్గాలను అందించటంలో కీలకమైన పాత్రను పోషించింది. షారూఖ్ ఖాన్ తో హార్పిక్ భాగస్వామ్యం, గౌరవమర్యాదలను, సంరక్షణను మరియు మెరుగైన పారిశుధ్యాన్ని ప్రతి భారతీయ కుటుంబానికి కల్పించటాన్ని ప్రోత్సహించే హార్పిక్ ప్రస్థానంలో ఒక కొత్త మైలురాయి కాగలదు.  

బ్రాండ్ తో తన అనుబంధాన్ని గురించి షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ “పరిశుభ్రత చిన్న చిన్న అర్ధవంతమైన పనులతో ప్రారంభమవుతుంది. దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల్లో పారిశుధ్యం మరియు డిగ్నిటీ విషయంలో విజయకేతనాన్ని ఎగురవేస్తున్న హార్పిక్ తో భాగస్వామ్యం నాకు గర్వకారణం. గుర్తింపు లేని హీరోలు – హోమ్ మేకర్ల పట్ల నాకు ఎంతో గౌరవం ఉన్నది. హోమ్ మేకర్ల నిబద్ధత~ కుటుంబాలు ఆరోగ్యం మరియు ఆనందంగా ఉండేందుకు దోహదం చేస్తుంటుంది. వారికి అత్యుత్తమమైనదానిని పొందే అర్హత ఉన్నది. హార్పిక్ హై నా తో, కేవలం అయిదు నిముషాల్లో లభించే అత్యుత్తమ పారిశుధ్యం ప్లస్ క్లీనింగ్ యాక్షన్^, ఎక్కువ సమయం నిలిచి ఉండే తాజాదనాలను ప్రతి కుటుంబం ఆశించవచ్చు. జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో కోరుకునే ఒక తిరుగులేని హామీ వంటి హార్పిక్ హై నా, ప్రతి కుటుంబానికి విశ్వసనీయమైన భాగస్వామిగా నిలుస్తుంది. ” అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -