- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సహాయ పంపిణీ కేంద్రాల సమీపంలో కాల్పులు జరిగాయి. ఆహారం కోసం ఎదరుచూస్తున్న సమయంలో ఈ ఘాతుకం జరిగిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు, ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. కాల్పుల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.
- Advertisement -