Saturday, May 3, 2025
Homeక్రైమ్కుటుంబ కలహాలతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – శామీర్ పేట : కుటుంబ కలహాలతో ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోచంపల్లి హనుమంతు (48) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే శుక్రవారం మే 2న మధ్యాహ్నం 2గంటలకు శామీర్ పేట కట్టమైసమ్మ వద్ద బ్రిడ్జి కింద విగతాజీవిగా ఉన్నాడని సమాచారం వచ్చిందని వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని పేరు పోచంపల్లి హనుమంతు అని కుటుంబ కలహాల వల్ల కట్ట మైసమ్మ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -