నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ హై స్కూల్ విద్యార్థులు పది ఫలితాల్లో పట్టణంలో మంచి ఉత్తమ ఉత్తీర్ణత సాధించారని పాఠశాల కరస్పాండెంట్ రేవ ఎస్ జూడ తెలిపారు. పాఠశాల టాపర్ గా గొర్ల వర్షశ్రీ 564/600, కుక్కదువ్వు వైష్ణవి 552/ 600 మర్రి మధుప్రియ 528/600 మార్కులు సాధించారు. 27 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6మంది విద్యార్థులు 500మార్కులకు పైగా, 14మంది విద్యార్థులు 400పైగా, 7మంది విద్యార్థులు 300పైగా ఉత్తిర్ణత సాధించారని తెలిపారు. విద్యార్థులను శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జుడా మాట్లాడుతూ.. పాఠశాల స్థాపించి 35 సంవత్సరాల నుండి అనేకమైన విద్యార్థులను ఉన్నత స్థాయి తీసుకెళ్లినటువంటి ఘనత మా పాఠశాలకు దక్కుతుందని తెలిపారు. మీ పిల్లల భవిష్యత్తు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడానికి పాఠశాల సిద్ధంగా ఉందని,అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న పట్టణంలో ఏకైక పాఠశాల ఇండియా మిషన్ హై స్కూల్ అని అన్నారు. మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జార్జ్ జోసఫ్, అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పది ఫలితాల్లో ఇండియా మిషన్ హైస్కూల్ సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES