ఎగ్జిబిషన్‌ ఆదాయంతో నూతన విద్యా సంస్థలు

–  హౌంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నుమాయిష్‌ ముగింపు వేడుకలు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్‌ సొసైటీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలను నెలకొల్పి విద్యా వ్యాప్తికి పాటు పడుతోందని హౌం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. సోమవారం నాంపల్లిలో నుమాయిష్‌ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమం చేస్తున్న సమయంలో అప్పటి పాలకులు రాష్ట్రం ఏర్పడితే విద్యుత్‌, సాగునీటి సమస్య, శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందన్నారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల వారు వారి రాష్ట్రాలలో అమలు పరుస్తున్నారన్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలలో ఒక్క జిల్లా తప్ప తొమ్మిది జిల్లాలు వెనకబ డి ఉన్నాయని ఎద్దేవ చేశారని, నేడు అన్ని జిల్లాలు అభివద్ధి పథ ంలో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రతీ సంవత్సరం నిర్వ హించే నుమాయిష్‌కు ఎంతో చరిత్ర ఉందని, నుమాయిష్‌ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు విచ్చేసి వ్యాపారాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చే ఆదాయంతో సొసైటీ రాష్ట్రంలో విద్యా సంస్థలను నెలకొల్పి విద్యా వ్యాప్తికి పాటు పడుతోందని కొనియాడారు. ప్రధానంగా మహి ళలకు విద్యా బోధన చేయిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి విద్యా బోధన అందించాలనే సంక ల్పంతో ముఖ్యమంత్రి రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేశార ని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీస్‌శాఖకు ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధు లను కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం నుమాయిష్‌ విజయవంతంగా సాగేందుకు పాటుపడిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్టాల్‌ హౌల్డర్లకు, పలు తరగతు లలో ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కొంద రికి గోల్డ్‌ మెడల్స్‌ అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్‌ మార్గం, సెక్రటరీ సాయినాథ్‌ దయాకర్‌ శాస్త్రి, జాయింట్‌ సెక్రటరి వనం సురేందర్‌, నరోత్తం రెడ్డి పాల్గొన్నారు.

Spread the love