- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నేటి నుంచి 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమె దీక్ష ప్రారంభించనున్నారు. ఈ దీక్షలో కవితతో పాటు తెలంగాణ జాగృతి సభ్యులు పొల్గొననున్నారు. దీక్షకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కవిత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
- Advertisement -