కైరో : ఇజ్రాయిల్ కొన్ని షరతులకు అంగీకరిస్తే గాజాలో తన వద్ద బందీలుగా ఉన్న వారికి సాయం అందజేస్తామని, ఇందుకోసం రెడ్‌క్రాస్‌తో సమన్వయం చేసుకుంటామని హమాస్ తెలిపింది. గాజాలోకి ప్రజలు, నిత్యావసరాల రవాణాపై విధించిన నిర్బంధాలను ఇజ్రాయిల్ శాశ్వతంగా తొలగించాలని, పంపిణీ సమయంలో వైమానిక దాడులు ఆపేయాలని, అప్పుడే రెడ్‌క్రాస్‌తో సమన్వయం చేసుకొని బందీలకు సాయపడతానని చెప్పింది. గాజాలో ఇప్పటికీ 50 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయిల్ చెబుతోంది. అయితే వీరిలో కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తోంది.
తన వద్ద బందీగా ఉన్న ఇజ్రాయిల్ పౌరుడు డేవిడ్ ఓ గోతిని తవ్వుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియోను హమాస్ మూడు రోజుల క్రితం విడుదల చేసింది. ఇది హమాస్ విడుదల చేసిన రెండో వీడియో. తాజా వీడియోలో బక్కచిక్కిపోయి అస్థిపంజరంలా ఉన్న డేవిడ్ ఓ గోతికి తవ్వుతూ కన్పించాడు. తాను చనిపోయిన తర్వాత పూడ్చి పెట్టేందుకే ఈ గోతిని తవ్వుతున్నానని అతను చెప్పాడు. డేవిడ్ వీడియోపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో బందీల పరిస్థితిపై చర్చించడానికి మంగళవారం ఐరాస భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమవుతుందని ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా బందీలకు మానవతా సాయం అందించాల్సిందిగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ రెడ్‌క్రాస్‌ను కోరారు.
అవరోధాలు తొలగిస్తే బందీలకు సాయం : హమాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES