Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలు9 లక్షల నగదు చోరీ…

9 లక్షల నగదు చోరీ…

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మూసి ఉన్న ఓ మొబైల్ షాప్ షట్టర్ తాళాలను పగులగొట్టిన గుర్తు తెలియని దుండగులు, క్యాష్ కౌంటర్లోని రూ.9 ల క్షల నగదుతో పాటు డివిఆర్ ను ఎత్తుకెళ్లారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చే సుకుంది. ఇన్ స్పెక్టర్ నర్సింహా తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్ బజార్ లోని గుజరాతీ గల్లీలో ని ఓ భవనం మొదటి అంతస్తులో ముసరా రామ్ దేవాశి లక్ష్మీ మొబైల్స్ షాప్ నిర్వ హిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు మొదటి అంతస్తులోని లక్ష్మీ మొబైల్స్ షాప్ షట్టర్ తాళాలు పగులగొట్టి, లో పలికి చొరబడి క్యాష్ కౌంటర్లో గల రూ. 9 లక్షల నగదు తస్కరించడంతో పాటు డివిఆర్ లు కూడా ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం యధావిధిగా మొబైల్ షాప్ కు వచ్చిన నిర్వాహకులు మసరా రామ్ దేవాశి షాప్ తాళాలు పగు లగొట్టి ఉండటం గమనించి, కంగారు పడి లోపలికి చూసే సరికి క్యాష్ కౌంటర్లో రూ.9 లక్షల నగదుతో పాటు డివిఆర్ కనిపించ లేదు. దీంతో బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుల్తాన్ బజార్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. క్లూ స్ టీమ్, ఫింగర్ ప్రింట్ బృందాలు ఘటనా స్థలాన్ని సందర్శించి సేకరించిన ఆధారాల సహా యంతో నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -