Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ దిగొచ్చింది: ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి

నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ దిగొచ్చింది: ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గతంలో నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల వద్దకు వచ్చిందని.. అవసరమైతే మళ్లీ అంత దూరం వెళ్తానన్న‌ని, త్యాగమైనా, పోరాటమైనా మునుగోడు ప్రజల కోసమేన‌ని ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.

“నేను ఎదన్న మాట్లాడితే మంత్రి రాలేదని ఇలా మాట్లాడుతున్నా అంటున్నారు.. ఎల్‌బీనగర్‌లో పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. నాకు వద్దు మునుగోడు ప్రజలే కావాలని ఇక్కడికి వచ్చాను. నాకు మంత్రి పదవి కావాలా? మునుగోడు ప్రజలు కావాలా? అంటే మునుగోడు ప్రజలే కావాలని చెప్పాను. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటోడికి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది. అందరిలాగా పదవుల్లోకి పోయి పైరవీలు చేసి దోచుకునే వ్యక్తిని కాదు. వేల కోట్లు దోచుకునేటోళ్లకి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. మీరు పదవి ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇస్తారా? లేదా? అనేది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవడి ఇంటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నా వెంట ప్రజలు ఉన్నారు. నాకు కావాల్సింది ప్రజలే..” అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -