– ఛేదనలో సన్‌రైజర్స్ చతికిల
– గుజరాత్ 224/6, హైదరాబాద్ 186/6
అహ్మదాబాద్ : ఐపీఎల్18 ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ దాదాపుగా నిష్క్రమించింది. శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 38 పరుగుల తేడాతో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. సీజన్లో ఏడో ఓటమికి మూట గట్టుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్ సాంకేతికంగా మాత్రమే నిలువగా.. వాస్తవిక అవకాశాలు ఆవిరయ్యాయి. 225 పరుగుల భారీ ఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (74, 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆశలు రేపినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. ట్రావిశ్ హెడ్ (20), ఇషాన్ కిషన్ (13), హెన్రిచ్ క్లాసెన్ (23), అనికెత్ వర్మ (3), కామిందు మెండిస్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో నితీశ్ కుమార్ రెడ్డి (21 నాటౌట్), పాట్ కమిన్స్ (19 నాటౌట్) ఓటమి అంతరాన్ని కుదించే ఇన్నింగ్స్‌లు ఆడారు. టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ (2/19), సిరాజ్ (2/33)లు రాణించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (76, 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్ బట్లర్ (64, 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (48, 23 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జైదేవ్ ఉనద్కత్ (3/35) మూడు వికెట్లతో మెరిశాడు. టైటాన్స్‌కు పది మ్యాచుల్లో ఏడో విజయం కావటం విశేషం.
ఓటమి నం.7
- Advertisement -
- Advertisement -