తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ కార్యదర్శి భూపాల్
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్
రిక్రూట్‌మెంట్ బోర్డు ఎదుట ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
వైద్య ఆరోగ్య శాఖలో పారా మెడికల్ పోస్టుల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. 2024 సెప్టెంబర్‌లో పారా మెడికల్ పోస్టులు భర్తీ చేపట్టారని, వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 (1284 పోస్టులు), నర్సింగ్ ఆఫీసర్స్ 2322 పోస్టులు, ఫార్మసిస్ట్ గ్రేడ్-2 (732) పోస్టులు, ఎంపీహెచ్‌ఎ ఫిమేల్ పోస్టులు 1931 మొత్తం 6269 పోస్టుల్లో నియామకాలు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో రిటర్న్ ఎగ్జామ్ పూర్తి చేసి ‘కీ’ విడుదల చేశారని తెలిపారు. ప్రొవిజినల్, ఫైనల్ మెరిట్ లిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు కుమారస్వామి, కిరణ్మయి, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు పాల్గొన్నారు.
వైద్య శాఖలో రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES