Sunday, May 4, 2025
Homeఅంతర్జాతీయంనిజాయితీ రుజువు చేసుకోవాల్సిందే

నిజాయితీ రుజువు చేసుకోవాల్సిందే

- Advertisement -

చర్చలపై అమెరికా ప్రతిపాదనలను అంచనా వేస్తున్నాం : చైనా
బీజింగ్‌:
టారిఫ్‌ల అంశంపై చైనాతో చర్చలు జరపాలని భావిస్తున్నట్టు అమెరికా ఇటీవల పలు మార్గాల ద్వారా పదే పదే ప్రతిపాదనలు పంపినందున, ప్రస్తుతం తాము పరిస్థితులను, ఆ ప్రతిపాదనలను అంచనా వేస్తున్నామని చైనా తెలిపింది. అమెరికా చర్చలు జరపాలనుకుంటే అందుకు సన్నాహాలు చేయడం, నిర్దిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా అంటే చేసిన తప్పుడు చర్యలను సరిదిద్దుకోవడం, ఏకపక్షంగా విధించిన టారిఫ్‌లను ఎత్తివే యడం వంటి కార్యాచరణను చేపట్టడం ద్వారా నిజాయితీని నిరూపిం చుకోవాల్సి వుంటుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఒకవేళ పోరాడాల్సిన పరిస్థితులే ఎదురైతే, చైనా తుదికంటా పోరాడుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ విషయమై చైనా వైఖరి చాలా స్పష్టంగా వుందన్నారు. చర్చలు జరపాల్సి వచ్చినా అందుకు ద్వారాలు తెరిచే వున్నాయన్నారు. టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధం అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిందని పేర్కొంది. ఏ విధమైన చర్చలు జరిపినా, అమెరికా గనుక తన తప్పుడు నిర్ణయాలు, ఏకపక్షంగా అమలు చేసిన చర్యలను దిద్దుకోకపోతే వారివైపు నుండి నిజాయితీ లోపించినట్లే భావించాల్సి వస్తుందని, పైగా పరస్పర విశ్వాసం దెబ్బతింటుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఒకటి మాట్లాడుతూ మరొకటి చేయడం లేదా బలవంతపు చర్యలకు, బ్లాక్‌మెయిల్‌ కు ఒక ముసుగుగా ఈ చర్చల ప్రక్రియను ఉపయోగించు కోవడానికి ప్రయత్నిం చడం వంటివి చైనాతో కుదరవని వాణిజ్య శాఖ ప్రతినిధి తేల్చి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -