– నగ్నంగా నడిపించి దుర్భాషలాడుతూ కర్రలతో దౌర్జన్యం
– బరితెగించిన ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ మూకలు
– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : సీఐకి దళిత సంఘాల నాయకుల ఫిర్యాదు
నవతెలంగాణ- చేర్యాల
మతిస్థిమితం లేని దళిత యువకునిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. నగంగా నడిరోడ్డుపై నడిపించుకుంటూ.. దుర్భాషలాడుతూ యువకునిపై దాడి చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామ శివారు ఎల్లదాసునగర్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. బేడ బుడగ జంగాల(దళిత) సామాజిక తరగతికి చెందిన మతిస్థిమిత ం లేని ఊపిరి అజరుకుమార్‌పై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపై నగంగా నడిపించుకుంటూ తీసుకెళ్తూ.. దుర్భాషలాడుతూ.. జై శ్రీరాం అనే నినాదాలు చేస్తూ.. యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గత మంగళవారం జరగ్గా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో వెలుగులోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌కు సంబంధించిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని, వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ఎల్.శ్రీనుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. యువకున్ని కర్రలతో కొడుతూ అర్ధనగంగా ఊరేగించి.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి.. గుడి గోడకు కట్టేసి విపరీతంగా దాడి చేశారని తెలిపారు. దుండగలను తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు. మతం పేరుతో భారత్ మాతాకీ జై అంటావా లేదా అని దళితుల మీద దాడి చేయడం అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలు చేర్యాల ప్రాంతంలో జరగడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, లేని యెడల దళిత సంఘాలుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బక్కెల్లి బాలకిషన్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మల్లిగారి యాదగిరి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రామగళ్ల నరేష్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యద ర్శి సనవాల ప్రసాద్, అంబేద్కర్ సంఘం నాయకులు జేరిపోతుల పరుశరాములు, మల్లిగారి రాజు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు బుట్టి బిక్షపతి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, పుట్ట రాజు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కొండ్ర మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మల్యాల శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు భూమిగారి మధుకర్, బీఆర్‌ఎస్‌వి ప్రేమ్ కుమార్, భూమిగారి దామోదర్ ఉన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలను అరెస్టు చేయాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఊపిరి అజరుకుమార్‌పై దాడి చేసిన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. దళితుడిపై దాడి చేసిన మతోన్మాదులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యానేరం క్రింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
దళిత యువకుడిపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES