Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్న ప్రభుత్వం

కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్న ప్రభుత్వం

- Advertisement -

సెప్టెంబర్‌లో యూనియన్‌ రాష్ట్ర మహాసభ
మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్‌
ఆహ్వాన సంఘం ఏర్పాటు
నవతెలంగాణ-తుర్కయంజాల్‌

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల భద్రతను గాలికొదిలేస్తోందని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్‌ విమర్శించారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం మంగళవారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని అరుణ ఫంక్షన్‌ హాల్‌లో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిషన్‌, టి.నర్సింహా అధ్యక్షతన జరిగింది. సెప్టెంబర్‌ 19-20 తేదీల్లో తుర్కయంజాల్‌లో రాష్ట్ర మహాసభ జరగనుంది. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. వారికి పని భద్రత, పర్మినెంట్‌కు నోచుకోవడం లేదన్నారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్సిపల్‌ కార్మికుల పర్మినెంట్‌, కనీస వేతనాల అమలుతోపాటు 2వ పీఆర్సీలో మినిమం బేసిక్‌ రూ.26 వేతనం నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. మహాసభ జయప్రదానికి విరాళాలు ఇవ్వాలని, మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాసభ ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ జి.కవిత, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వప్న, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి బలరామ్‌, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ జిల్లా అధ్యక్షులు జి.యాదగిరి, నాయకులు సీహెచ్‌. ఎల్లేష్‌, జె.పెంటయ్య, బాబు పాల్గొన్నారు.
ఆహ్వాన కమిటీ..
ఆహ్వాన కమిటీ చైర్మెన్‌్‌గా తిప్పర్తి యాదయ్య (డిప్యూటీ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఉద్యోగుల సంఘం), జనరల్‌ సెక్రటరీ డి.కిషన్‌ (యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు), ట్రెజరర్‌ సిహెచ్‌.ఎల్లయ్య, చీఫ్‌ ప్యాట్రన్స్‌ పాలడుగు భాస్కర్‌ (యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు), ప్యాట్రన్స్‌గా ఎం.చంద్రమోహన్‌ (రంగారెడ్డి జిల్లా కార్యదర్శి) తదితరులతో ఆహ్వాన సంఘం ఏర్పడిరది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -