Sunday, May 4, 2025
Homeజాతీయంఅమరావతికి సహకరిస్తాం

అమరావతికి సహకరిస్తాం

- Advertisement -

– ఏపీ కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలు : మోడీ
అమరావతి:
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఇది శుభ సంకేతమని చెప్పారు. వికసిత్‌ భారత్‌కు ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని.. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి పున్ణనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టిన ఆయన.. ”దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అన్నారు. తన ప్రసంగం మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు..
”టెక్నాలజీ నాతో మొదలైనట్టు చంద్రబాబు ప్రశంసించారు. నేను కేంద్రంలో కొట్టకుపోయింది. సూరారం, బెంగుళూరు, అంబటిపల్లి ఇతర వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. గణపురం మండలంలో కరెంటు పోల్స్‌ నేలకొరిగాయి. సీతారాంపురం గ్రామంలో మంచినీటి కష్టాలు ఏర్పడటంతో శుక్రవారం బీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు వైనాల వెంకటేష్‌ ఆధ్వర్యంలో బీసీ కాలనీలో జనరేటర్‌ సహాయంతో బోరు చేయాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివ ృద్ధి చెందు తున్న దేశంగా భారత్‌ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు సాయం చేస్తోంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు.. ఒక స్వప్నం సాకారాం కాబోతోందనే భావన కలుగుతోంది. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టు లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్‌ భారత్‌ ఆశయాలకు బలమైన పునాదులు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటే శ్వరస్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హ ృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక క తజ్ఞతలు చెబుతున్నా” అన్నారు.”ఇంద్రలోకం రాజధాని అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్‌, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతి. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగు తుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్య స్థానంగా మారు తుంది. హరితశక్తి, స్వచ్ఛపరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మారు తుంది. అమరావతిలో మౌలికవసతుల కల్పనకు కేంద్ర సహకరిస్తుంది” అని చెప్పారు.
కనెక్టివిటీకి కొత్త అధ్యాయం..
”ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు పర్యాటకాభివ ృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌ రూ.900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత పదేండ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. వందేభారత్‌, అమ ృత్‌ భారత్‌ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమ ృత్‌ భారత్‌ ప్రాజెక్టు కింద అభివ ృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సిమెంట్‌, స్టీల్‌, రవాణా రంగాలు అభివ ృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టుల వల్ల వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతు వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా క ృషిచేస్తోంది. రైతులకు పథకాలు, పరిహారం కింద రూ.17వేల కోట్లు సాయం చేశాం. పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తాం. ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేందుకు క ృషిచేస్తాం” అని చెప్పారు.”వికసిత్‌ భారత్‌ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివ ద్ధి చెందాలి. ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలు లాంటివారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాయలంకలో టెస్టింగ్‌ రేంజ్‌.. దుర్గామాత లాగా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్‌ కోట్లాది భారతీయులకు గర్వకారణం. భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదు.. మన ఐక్యత కూడా. విశాఖలో యునిటీమాల్‌ అభివ ృద్ధి చేస్తున్నాం” అని మోడీ తెలిపారు.
విశాఖలో యోగా డేకు హాజరవుతా
”విశాఖలో జూన్‌ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్‌. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు.. ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువకాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోంది. సరైన వేగంతో ముందుకెళ్తోంది. దీన్ని కొనసాగించాలి. మూడేండ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోంది. ఏపీ అభివ ృద్ధిలో మీ భుజంతో కలిపి నా భుజం కలిపి పనిచేస్తాను. అందరికీ హ దయ పూర్వక శుభాకాంక్షలు” అని ప్రధాని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -