గుజరాత్‌ మోడల్‌ ఊకదంపుడే

– తేటతెల్లం చేసిన నిటిఅయోగ్‌ నివేదిక : కోలేటి దామోదర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేదరిక నిర్మూలనలో తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించిందని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గహ నిర్మాణ సంస్థ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిటిఅయోగ్‌ విడుదల చేసిన నివేదికతో గుజరాత్‌ మోడల్‌ ఊకదంపుడు ప్రచారమనేది తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. జాతీయ పేదరిక సగటుతో పోలిస్తే తెలంగాణలో పేదరికం మూడో వంతు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణకు, గుజరాత్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. నిధులు, పరిశ్రమలు గుజరాత్‌కు మళ్లించుకున్నా పేదరిక నిర్మూలనలో ఆ రాష్ట్ర పరిస్థితి దయనీయంగానే ఉందని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పాలనలో గుజరాత్‌ వెలవెలబోతున్నదని తెలిపారు. నిధులు కేటాయించకుండా కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నా…. రాష్ట్ర ప్రగతిని ఆపలేకపోవడానికి సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న సంపద పెంచు – ప్రజలకు పంచు నినాదం, విధానం, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకందించడమే కారణమని వివరించారు.

Spread the love