Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఎడ్ బిడ్ లో మాయాజాలం..

ఎడ్ బిడ్ లో మాయాజాలం..

- Advertisement -

– సిసి రోడ్డు వేయకున్న బిల్లు మంజూరు
నవతెలంగాణ -ముధోల్ : ఎక్కడైనా ప్రభుత్వ  నిధులతో చేసే అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత బిల్లులు మంజూరు చేయడం జరుగుతుంది. అయితే సిసి రోడ్లు వేయకుండా బిల్లు మంజూరు చేసిన వైనం ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే… ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 7 లక్షల రుపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ సిసి రోడ్డు గ్రామంలో రావుల సాయిరెడ్డి ఇంటి నుండి భూషణ్ రెడ్డి ఇంటి వరకు మార్చి నెలలో నిర్మించాలి. అయితే సిసి రోడ్డు నిర్మించుకుండనే ఏకంగా పంచాయతీ రాజ్ అధికారులు సిసి రోడ్డు పూర్తి అయిన్నట్లు మార్చి 30వ తేదీ న ఆన్లైన్ లో పొందుపర్చారు. దీంతో బిల్లు 697287 రుపాయలు మంజూరు చేశారు. సిసి రోడ్డు నిర్మించకుండా  అధికారులు బిల్లులు మంజూరు చేయటం పై పలు  అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారం బయటకు పోక్కటంతో అధికార పార్టీ నాయకులు సరిదిద్దుకుంటున్న పనిలో నిమగ్నమయ్యారు. దీంతో సిసి రోడ్ కు సంబంధించిన మెటీరియల్ బుధవారం రాత్రి డంపు చేశారు. తాజాగా గురువారం రోజు సిసి రోడ్డు వేయడానికి రోడ్డు ను  చదును చేస్తుండగా బయటపడటంతో పంచాయతీరాజ్ అధికారులు ఆపివేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిన అధికారులే తుంగలో తొక్కడం కాకుండా మళ్లీ  కప్పిపుచ్చుకోవటం ప్రయత్నం చేయటం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం బయటపడకుంటే  ప్రభుత్వ బిల్లు స్వాహా చేసేవరని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img