Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీసీ కెమెరాల నిఘాలో నీడలో రామారం: గజ్వేల్ ఏసిపి కె. నర్సింలు 

సీసీ కెమెరాల నిఘాలో నీడలో రామారం: గజ్వేల్ ఏసిపి కె. నర్సింలు 

- Advertisement -

నవతెలంగాణ -రాయపోల్
శాంతి భద్రతలు పరిరక్షణలో నేరాలు నియంత్రణలో ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని సీసీ కెమెరాల నిఘా నీడలో రామారం గ్రామం ఉందని గజ్వేల్ ఏసిపి కె. నర్సింలు గురువారం రాయపోల్ మండలం రామారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు జాల దుర్గాప్రసాద్ సహకారంతో 10 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిద్దిపేట కమిషనర్ డా.అనురాధ ఆదేశాల మేరకు రామారం గ్రామంలో దాత జాల దుర్గాప్రసాద్ సహకారంతో 10 సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో గ్రామ ప్రవేశ ద్వారాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చన్నారు.  సీసీ కెమెరాలు మరింత భద్రత మరియు సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పిస్తాయని, 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. సీసీ కెమెరాలు ఉండి పని చెయ్యని గ్రామాలలో, సిసి కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు మరియు రిపేర్ చేయడానికి డివిజన్ పోలీసులకు సహకరించాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై  ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలని ఎలాంటి సమాచారం ఉన్న పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా యువకులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలిపారు.

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి లింకులు వచ్చినా ఓపెన్ చేయవద్దని సూచించారు. మానవ తప్పిదము వల్లనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలను అవగాహన కల్పించి చైతన్యపరిచిన ఎస్సై మానస, వీపిఓ హెడ్ కానిస్టేబుల్ కనుకయ్య లను అభినందించారు. కెమెరాల దాత దుర్గాప్రసాద్ ను శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సిఐ షేక్ లతీఫ్, ఎస్ఐ కుంచెం మానస, పంచాయతీ కార్యదర్శి బాలయ్య, మాజీ సర్పంచులు హనుమంతు, మహేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు గోపాల్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img